
గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన పిక్సెల్ 4ఏ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4680 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 449 డాలర్లుగా(సుమారు రూ.33,400) నిర్ణయించారు. మోస్ట్లీ బ్లాక్ కలర్ వేరియంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెరికా, జపాన్‌ల్లో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.34 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. హెచ్‌డీఆర్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 12.2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4680 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్సీ, 3.5 ఎంఎ: హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.