
ఐఫోన్ ప్రియులు ఆసక్తిగా వేచిచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13లను టెక్ దిగ్గజం నిన్న విడుదల చేసింది. ప్రతీ ఏడాదిలానే ఈ సెప్టెంబర్ 14న కాలిఫోర్నియాలో జరిగిన ‘యాపిల్ ఈవెంట్’లో ఐఫోన్ 13 శ్రేణిని విడుదల చేశారు. గతేడాది వచ్చిన ఐఫోన్ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 13 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజీ విషయానికొస్తే ఇవి 128 జీబీ నుంచి లభిస్తాయి. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అటు ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్ 7 సిరీస్ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది.
భారత్‌లో ధరలు ఇలా.. (అంచనా)
- 13 మినీ రూ.69,900
- 13 రూ.79,000
- 13 ప్రొ రూ.1,19,900
- 13 ప్రొ మాక్స్ రూ.1,29,900
ఐప్యాడ్లు..
- ఐప్యాడ్ ప్రారంభ ధర: 360 డాలర్లు
- ఐప్యాడ్ మినీ ప్రారంభ ధర: 499 డాలర్లు
- డిస్ప్లే: 8.3 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే
- ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
- బ్యాంక్ కెమెరా: 12 మెగాపిక్సెల్
- ఇతర ఫీచర్లు: స్మార్ట్ హెచ్డీఆర్, 4కే వీడియో రికార్డింగ్, వైఫై, సెల్యులార్ కన్ఫిగరేషన్స్, యూఎస్బీ-సీ పోర్ట్, 5జీ మోడెమ్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో స్టీరియోతో సరికొత్త స్పీకర్ వ్యవస్థ
యాపిల్ వాచ్ సిరీస్ 7
- ప్రారంభ ధర: 399 డాలర్లు
- 41ఎంఎం, 45ఎంఎం సైజుల్లో లభ్యం
- బ్యాటరీ సామర్థ్యం: 18 గంటల వరకు
- యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌పై చార్జింగ్
- క్రాక్ రెసిస్టెంట్ టెక్నాలజీ