
ఫోన్ లో ఇప్పటి వరకు టచ్ స్మార్ట్ ఫోన్స్, ఫీచర్ స్మార్ట్ ఫోన్స్ తెలుసు. వీటిని వేళ్ళతో గాని టచ్ తో గాని ఆపరేట్ చేసే వెసులుబాటు వుండేది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయడానికి ప్రైవసీ సెక్యూరిటీ గా ఫేస్ లాక్ ఆప్షన్ ఉంది, అలాంటి ఫేస్ లాక్ ఆప్షన్ లాగా ఇకపై ఫోన్ అంతా ముఖ కవళికలు, సంజ్ఞలతో దానిని నియంత్రించే వెసులుబాటు కొత్త తరం ఫోన్ లలో రాబోతోంది. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులోని యాక్సెసిబిలిటీ ఫీచర్ సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను నియంత్రించవచ్చు. ఇందులో భాగంగా ‘కెమెరా స్విచెస్ ఫీచర్’ను రాబోయే ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో డెవలప్ చేస్తోంది. దీని ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి చూడడం వంటి వాటితోనే ఫోన్‌ను నియంత్రించే వీలు కలుగుతుంది.
హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి కూడా ఈ ఫీచర్లో ఉంటాయి. అలాగే, సంజ్ఞ పరిమాణం, వ్యవధిని కూడా ఎడ్జెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. వైకల్యంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది చక్కగా ఉపయోగ పడుతుందని గూగుల్ పేర్కొంది.