
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి.. బాలీవుడ్ లో హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘తడప్’ పేరుతో అహన్ శెట్టి హీరోగా తారా సుతారియా హీరోయిన్ గా దర్శకుడు మిలాన్ లుత్రియా తెరకెక్కించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్.ఎక్స్. 100’కు ఇది హిందీ రీమేక్. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ట్రైలర్ లో అహన్ శెట్టి హ్యాండ్సమ్ లుక్స్, తారా సుతారియా గ్లామర్ అపీరెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
‘ఆర్.ఎక్స్. 100’ కథని అహన్ ఎంట్రీకి అనుగుణంగా.. కాస్తంత హీరోయిజం డోస్ పెంచుతూ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అర్ధమవుతోంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన విషయం అర్థమౌతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగులో కంటే కూడా చాలా భారీగా, లార్జర్ స్కేల్ లో మూవీని తీశారని తెలుస్తోంది. ఇక తెలుగు ట్రైలర్ లో ఉన్నట్టుగానే హీరోయిన్ ను, హీరో గొంతు నులమడం ట్రైలర్ లోని కొసమెరుపు.
ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. దాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ‘రా అండ్ ఇంటెన్స్ .. సాజిద్ నడియావాలా ‘తడప్’ ట్రైలర్ చాలా బాగుంది. అహన్ శెట్టి అండ్ టీమ్ కు నా ప్రేమ పూర్వక శుభాభినందనలు’.. అంటూ ట్వీట్ చేశారు.