
T20 World Cup 2022 NZ vs PAK: టీ20 ప్రపంచకప్లో తొలి సెమీ ఫైనల్ బుధవారం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. కొన్నేళ్లుగా న్యూజిలాండ్ చక్కగా రాణిస్తోంది. అన్ని రంగాల్లోనూ న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం బలీయంగా ఉంది. మరో వైపు పాక్ బౌలింగ్ బాగున్నా, బ్యాటింగ్లో బాబర్ ఆజమ్-రిజ్వాన్లపైనే ఆధారపడుతోంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.