
T20 World Cup 2022: టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతున్నారు. తక్కువ ఎకానమీతో, ఎక్కువ డాట్ బాల్స్ వేస్తూ, వికెట్లు తీస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో భువనేశ్వర్ ఇప్పటివరకు 16.4 ఓవర్లు వేశాడు. అంటే 100 బాల్స్ వేశాడు. ఇందులో 65 డాట్ బాల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన టీ20 బౌలర్ గా నిలిచాడు.