
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. విజేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తుది పోరులో తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభమైనప్పుడు అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమ్ ఇండియా లీగ్ దశను కూడా దాటలేదు. అటు ఇంగ్లాండ్, పాకిస్థాన్ సెమీస్ తోనే సరిపెట్టుకున్నాయి.
పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా టైటిల్ పోరులో తలపడనున్నాయి. కప్పు నీదా, నాదా అంటూ ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా సెమీ ఫైనల్లో బలమైన జట్లను ఓడించి ఫైనల్ చేరాయి. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సాధించని కివీస్ – ఆసీస్, తమ తొలి టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పేట్టు లేదు.
Four weeks of action comes down to this.#NewZealand meet foes #Australia with both teams on the hunt for their first men’s #T20WorldCup title.
Everything you need to know ahead of #NZvAUS ?https://t.co/rmT9IlCELn
— ICC (@ICC) November 14, 2021