
క్రికెట్ లో టీ20 ప్రపంచ కప్ యుద్ధం త్వరలో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కి సంబందించిన షెడ్యూల్ ని ఐసీసీ ఈ రోజు రిలీజ్ చేశారు. మొదట క్వాలిఫైర్ మ్యాచుతో ఈ టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా దేశాల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది.
ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ను అక్టోబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్కాట్లాండ్ మరియు బంగ్లాదేశ్ జట్లు మరో మ్యాచ్‌లో తలపడతాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తోనే ఆడబోతోంది.
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. మెగా టోర్నీ యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహించనున్నట్లు ఐసీసీ అప్పటికే ప్రకటించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో మెగా టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగనుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి.
https://twitter.com/ICC/status/1427496340376809475
ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ 2లో ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. రౌండ్ 1లో అర్హత పొందిన మరో రెండు జట్లు కూడా చేరనున్నాయి.
పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది. మరోవైపు గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ సహా మరో రెండు జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు క్వాలిఫైర్ మ్యాచులు ఆడనున్నాయి.