
దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి.. పొట్టి క్రికెట్ విజేతగా అవతరించింది. న్యూజిలాండ్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది ఘన విజయం సొంతం చేసుకుంది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడాలనే కలను ఆస్ట్రేలియా నేర్చుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదరగొట్టాడు. అర్ధ శతకంతో (85) పరుగులతో ఆకట్టున్నాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది కివీస్. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ 11, ఫిలిఫ్స్ 18, నీషమ్ 13, సీఫర్ట్ 8 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా..డేవిడ్ వార్నర్ 53, మిచెల్ మార్ష్ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ ను విజయ తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా తొలిసారి టీ-20 ప్రపంచ విజేతగా నిలిచింది.