
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. బుధవారం అష్టమి కావడంతో గురువారం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆయన భౌతికకాయాన్ని ముందుగా ఇంటికి తరలించి, అక్కడి నుంచి అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.