
రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు నిర్వహించడానికి రెడీ అయ్యాడు. కరోనా కాలంలో చాలా మందిని ఆదుకున్న సోనూసూద్ కి కొత్త బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తున్న ‘దేశ్ కి మెంటార్’ కార్యక్రమానికి సోనూసూద్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. శుక్రవారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అతి త్వరలో ఢిల్లీ లో మా ప్రభుత్వం ప్రారంభించనున్న ‘దేశ్ కి మెంటర్’ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సోనూసూద్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సోనూసూద్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్ ‘దేశ్ కి మెంటర్’ కార్యక్రమం ద్వారా చాలా మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం నాకు దక్కింది. ఇంత కంటే గొప్ప సేవ ఏది లేదు అంటూ తప్పకుండా చేస్తాను అని సోనూసూద్ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి తప్పకుండ పని చేస్తానని సోనూసూద్ వెల్లడించారు.
రాజకీయల్లో కి రమ్మని చాలామంది అడుగుతున్నారని కానీ అలాంటి ఆలోచనలు ఇప్పుడు లేవని, మంచి పని చేయాలంటే రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని చెప్పానని చెప్పారు. కేజ్రీవాల్ తో జరిగిన సంభాషణ లో కూడా ఎక్కడ రాజకీయ ప్రస్తావన రాలేదని ఆయన అన్నారు.