
శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న సినిమా ఆడాళ్లూ మీకు జోహార్లు . ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.రీసెంట్గా అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శర్వానంద్, రష్మికా మంధన్న సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు.చిత్ర హీరోయిన్ రష్మిక.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్‌లోనూ దుమ్ములేపుతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు మూడు బాలీవుడ్ సినిమాలున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలున్నాయి. ఇక ఇప్పుడు రష్మిక వరుసగా తెలుగు సినిమాలకే డేట్లు ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు పుష్ప చిత్రంతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.