
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను ఆర్కే మలినేని తెరకెక్కించారు. ఆశా జ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఈనెల 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇప్పటికే సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా సంపూ… ఇంగ్లీష్ దొరబాబు గెటప్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. ఆ తర్వాత సినిమాలో సంపూర్ణేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో విల్లు ఎక్కుపెడుతున్న ఉన్న స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ‘క్యాలీఫ్లవర్’ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇందులో బర్నింగ్ స్టార్ కాలీ ఫ్లవర్ పేరుతో నవ్వించేలా నటించాడు. నెత్తిమీద పిలకతో కాలీఫ్లవర్ లానే కనిపిస్తున్నాడు.
మగాడి శీల రక్షణే తన ధ్యేయమని, మగాళ్ల శీల రక్షణ కోసం చట్టం రావాలన్నదే తన పోరాటమంటూ నవ్వించే డైలాగులతో సాగింది టీజర్. మంగళవారం ఉదయం ఈ టీజర్ ను విడుదల చేశారు. ‘ఆకాశ వాణి కెమెరా పెట్టు… నా ఘోషేంటో ఈ ప్రపంచానికి తెలియాలి’ అన్న డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘ఎనీ టైమ్ శీలాన్నే కాపాడే సింబలేరా ఈ కాలీ ఫ్లవర్’ అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మొత్తంగా సంపూ నుండి వస్తోన్న ఈ కామెడీ సెటైరికల్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.