
కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమేనని తేలింది. హీరో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారు. విడాకుల విషయం నిజమేనని స్వయంగా నాగచైతన్య ట్విటర్లో వెల్లడించాడు. ‘‘సామ్, నేను ఇక కలిసి ఉండలేమని, భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇద్దరం కలిసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. పదేళ్లకు పైగా మేం మంచి స్నేహితులం. ఇకపై కూడా అలాగే కొనసాగాలని భావిస్తున్నాం. భార్యాభర్తలుగా విడిపోయినా.. మా మధ్య ప్రత్యేకమైన అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు అభిమానులు, మీడియా మిత్రులు సహకరించాలని కోరుకుంటున్నాం…’’ అని నాగచైతన్య ట్వీట్ చేశాడు.
https://twitter.com/chay_akkineni/status/1444241025430536194
సమంత కూడా అదే ప్రకటనను ఇంస్టాగ్రామ్ లోపోస్టు చేశారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నామని సమంత పేర్కొన్నారు.
“అవును… మేం విడిపోతున్నాం. మా దారుల్లో మేం పయనించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మా దారులు వేరైనా మా మధ్య ఎప్పటికీ ప్రత్యేకమైన బంధం ఉంటుందని నమ్ముతున్నాం. అభిమానులు, సన్నిహితులు, పాత్రికేయులు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు” అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో వివరించారు.