
Samantha Emotional: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకుని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది.
ఈ చిత్రంలో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. యాంకర్ సుమతో సమంత చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్య పరిస్థితి గురించి సమంత మరోసారి పెదవి విప్పింది. తాను తన అనారోగ్య పరిస్థితి గురించి పోస్టులో పెట్టిన విధంగానే కొన్ని రోజులు మంచి రోజులని కొన్ని రోజులు చెడ్డ రోజులని చెప్పుకొచ్చింది.
ఒక్కొక్క రోజు తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అలా వేస్తే ఇంకా అంతా అయిపోతుంది అనిపిస్తుందని ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని దాటి వచ్చానా అని అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది. నేనిక్కడ ఫైట్ చేయడానికి ఉన్నానని సమంత పేర్కొంది.
ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అని నేను గత కొన్నేళ్లుగా మన ప్రయాణంలో చూస్తూనే ఉన్నాను ఇప్పుడంటే బయటకు చెప్పారు బయటకి చెప్పని సమయంలో కూడా మీరు ఈ వ్యాధితో పోరాడుతూ ఎంత నొప్పి అనుభవించారో నాకు తెలుసు అని అంటే నేనొక్కదాన్నే కాదు జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడే వాళ్ళు ఎందరో ఉన్నారని సమంత తెలిపింది.