
విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచింది. వరస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి అనంతరం డిసెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకున్న సామ్… ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం ‘కాతువాకుల రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో పాటు ఓ థ్రిల్లర్ సినిమాకు సంతకం చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ అవకాశాల వైపు కూడా సమంత మొగ్గుచూపుతున్నట్టు టాక్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సామ్ తరువాతి అడుగు హాలీవుడ్‌లోనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత హీరోయిన్గా ఎంపికయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ హాలీవుడ్ అయినా.. ఈ సినిమా నిర్మాతలు మాత్రం టాలీవుడ్‌కు చెందినవారే. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ను గురు ఫిల్మ్స్ సమర్పణలో సునీత తాటి నిర్మిస్తున్నారని టాక్. ఇదివరకు సమంత నటించిన ‘ఓ బేబి’ చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మించింది.
ఇండియన్ రైటర్ టైమెరి ఎన్. మురారి రాసిన నవలే ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’. దీనిని బ్రిటిష్-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా పబ్లిక్ చేశారు. 2004లో విడుదలైన ఈ నవల అత్యధిక కాపీలు అమ్ముడై రికార్డ్ సాధించింది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు ఎంపికైనా ఏకైక ఇండియన్ నవలగా కూడా ఈ పుస్తకానికి రికార్డ్ దక్కింది. ఈ సినిమా కొంత భాగాన్ని మన దేశంలోనూ, మరికొంత భాగాన్ని వేల్స్‌లోనూ షూట్ చేయనున్నట్లు వినికిడి. సమంత హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన మరిన్ని విశేషాల కోసం వేచి చూద్దాం.