
ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో అలరించిన హీరోయిన్ సమంత మరో వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో తెరకెక్కనుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. సామ్ తో వెబ్ సిరీస్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమెతో చర్చలు కూడా జరిపిందని తెలుస్తోంది. కథ నచ్చడంతో సామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. కోలీవుడ్, బాలీవుడ్ పై ఆమె ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా కాన్సెప్ట్స్ మాత్రమే టేకప్ చేయాలని ఆమె భావిస్తోందట. సమంత ఇటీవల ఒక తమిళ సినిమా, శ్రీదేవి మూవీస్ సినిమాలకు సైన్ చేసింది.
ఒక వేళ తెలుగు ఇండస్ట్రీలో తన కెరీర్ అటూ, ఇటూ అయితే.. తమిళ, హిందీ సినిమాల్లో నటించాలనేది సమంత ప్లాన్ గా తెలుస్తోంది. వాటికోసం పాన్ ఇండియా స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవాలని సమంత భావిస్తోందని అంటున్నారు.