
చైతన్యతో విడాకుల తర్వాత నిత్యం బిజీగా ఉండటానికి సమంత ట్రై చేస్తోంది. ఒకపక్క ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ మరో పక్క వరుస సినిమాలకి ఓకే చెప్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే అంగీకరించేది. ‘రాజుగారి గది-2’, ‘ఓ బేబీ’, ‘మజిలీ’ వంటి సినిమాలలో సమంత క్యారెక్టర్ చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కమర్షియల్ జోన్లోకి వెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ‘పుష్ప’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఇందుకు సంబంధించిన సమాచారం పక్కాగా వచ్చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి సమంత స్టెప్పులతో అదరగొట్టనుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు పాట చిత్రీకరణ ఉంటుంది. దీంతో అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. అల్లు అర్జున్‌తో గతంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత నటించింది. ఇప్పుడు బన్నీతో కలిసి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ‘పుష్ప పార్ట్-1’ విడుదల కానుంది.