
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్ చికిత్స పొందుతున్నఅతడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. సాయిధరమ్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడాయన సొంతంగానే శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో అతడిని డిశ్చార్జ్ చేస్తామన్నారు.
“ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఎలాంటి ఇబ్బందిలేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. అందరితో మాట్లాడగలుగుతున్నాడు. మరో మూడు రోజుల్లో సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం” అని అపోలో బులెటిన్లో పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే, దేవా కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. సెన్సార్ సహా సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది.