
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ ఎత్తివేసిన కేసీఆర్ ధర్నా చేయడం వింతగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2016లో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ఎందుకు ఎత్తివేశారో తెలపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మరో పదేళ్లూ ప్రగతి భవన్ లోనే తిష్టవేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం పన్నుతున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు.