
RRR Collections: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ జపాన్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. జపాన్ లో విడుదల చేసేముందు ఈ చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తొలి నాలుగు రోజుల్లో 4 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 10 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. జపాన్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.