
RRR నుంచి తొలిపాట విడుదలైంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఇటీవల మేకింగ్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచిన చిత్రబృందం.. తాజాగా దోస్తీ అనే పాటను వదిలింది.ఈ సాంగ్ ను ఐదు భాషల్లో రూపొందించి రిలీజ్ చేశారు. అన్నిచోట్లా ప్రముఖ సింగర్లు గానం చేశారు.
తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్, హిందీలో అమిత్ త్రివేదీ, మలయాళంలో విజయ్ యేసుదాసు, కన్నడలో యాజిన్ నిజార్ గానం చేశారు. అక్టోబర్ 13న RRR ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి సారథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.