
‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో చిత్రంపై మరింత అంచనాలు పెంచేందుకు ఈ వేడుకను దుబాయ్‌లో ప్లాన్ చేసే విధంగా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోందట. ఈ ఈవెంట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ‘రోబో 2.0’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిపారు. అయితే ఒక తెలుగు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను ఇలా దుబాయ్ వేడుకగా భారీగా ప్లాన్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ‘బాహుబలి’తో టాలీవుడ్ ను అగ్రస్థానంలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు ప్రమోషన్ల విషయంలోనూ సరికొత్త బాటలో సాగుతున్నారు. నవంబర్‌లో చిత్రం నుండి టీజర్ విడుదల కానున్నట్టు తెలుస్తుండగా, ఇక్కడ నుండి ప్రమోషన్ని వేగవంతం చేయనున్నారట. అయితే ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. అన్ని సినిమాల మాదిరిగానే కాకుండా.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అన్ని భాషల్ని కవర్ అయ్యేలా చేస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారట రాజమౌళి.