
‘బాహుబలి’ కి దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి, తెలుగు సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక విషయానికి వస్తే బాహుబలి ని చెక్కిన జక్కన్న తీస్తున్న మరో భారీ సినిమా RRR. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొల్పుతున్నాడు మన జక్కన్న. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.మెగా, నందమూరి ఫ్యాన్స్ కి హై వోల్టేజ్ ఫీస్ట్ ఇవ్వడానికి జక్కన్న రెడీ అయ్యాడు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్,ఎమోషనల్ సీన్స్ ఉండేలా ఫాన్స్ ని ఉర్రూతలూగేలా ప్లాన్ చేశారు రాజమౌళి . సినిమా ఫాన్స్ కి మరో సర్ ప్రైజ్ రెడీ చేసింది RRR టీం. మరో నాలుగు రోజుల్లో అనగా జూలై నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు Roar Of RRR పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరు హీరోలకి సంబంధించిన కొన్ని మేకింగ్ సీన్స్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.
బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే పలుసార్లు షూటింగ్ వాయిదా పడటంతో సెకండ్ వేవ్ అనంతరం షూటింగ్ స్పీడు పెంచారు. ఎలాగైనా అతి త్వరలో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి.. చెప్పిన తేదీ అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలని బలంగా ఫిక్సయ్యారు.
ఈ మేరకు ట్విట్టర్ ఖాతా ద్వారా అప్డేట్ ఇచ్చారు డీవీవీ.
A glimpse into the making of #RRRMovie on July 15th, 11 AM.
ఈ భారీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.