
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో జక్కన్న రాజమౌళి చెక్కిన చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్ ‘.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్ర కథ అల్లూరి సీతారామ రాజు,కొమురం భీం వీరిరువురి పాత్రల ఆధారంగా ఉంటుందని జక్కన్న చెప్పారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆర్ఆర్ఆర్ గ్లింప్స్’ (RRR Glimpse) పేరుతో 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన సర్ప్రైజ్లకు భిన్నంగా రామ్‌చరణ్-తారక్ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్ (RamCharan).. అల్లూరి సీతారామరాజుగా, తారక్ (Tarak).. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ (Aliabhatt) ఈసినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక, తారక్‌కు జంటగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.