
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన హిట్ మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ నిలిచాడు.