
Rohit Sharma injured: ఇంగ్లాండ్తో గురువారం టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్ జరగనున్న తరుణంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం గాయపడ్డాడు. కుడి ముంజేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ శర్మ బాధతో విలవిల్లాడాడు. ప్రాక్టీస్ ఆపేసి, కుడి చేతికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కనిపించాడు. అయితే గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.