
సీఎం కెసిఆర్ ఇలాకా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పార్టీ నాయకులూ, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వి. హనుమంతరావు, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడున్నరేళ్ల తెరాస పాలనపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన చార్జిషీట్ ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. చార్టిషీట్లోని అంశాలను దామోదర రాజనర్సింహ ప్రజల ముందుంచారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ఈరోజు భారత దేశంలో తెలంగాణ విలీనమైన రోజు.
కానీ, అన్ని వర్గాల్లో నైరాశ్యం నెలకొంది. ఎస్సీలు, గిరిజనులు వారి హక్కుల సాధన కోసం సన్నద్ధమయ్యారు. వారి
హక్కుల కోసం కాంగ్రెస్ బాసటగా నిలుస్తుంది. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ, అమిత్ షా ప్రశ్నించారు.
మోడీ, కేసీఆర్ మాత్రమే అంతా చేసినట్లు చెప్పుకుంటున్నారు. స్వాతంత్య్రo తెచ్చింది. కాంగ్రెస్ అన్నది.
మర్చిపోయారా? దేశం కోసం మా నేతలు ఎందరో ప్రాణాలర్పించారు. తెలంగాణ ఇచ్చించే సోనియాగాంధీ.
ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు” అని ఖర్గే అన్నారు..