
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలోనే ఈ ఘటన జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన నైతిక బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తానని, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తానని, శాంతి భద్రతలను కాపాడతానని పెట్టుబడిదారులకు, ప్రజలకు పదే పదే చెప్పారన్నారు. మంత్రి దత్తత తీసుకున్న ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారని, ఆయన స్నేహితులు వెళ్లే పబ్‌లలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.