
తెలంగాణ రాష్ట్రం తర్వాత నిరుద్యోగ సమస్యలు తీరుతాయని చూసిన వాళ్లకు కన్నీరే మిగులుతుంది. తమ రాష్ట్రంలో తమకు అన్ని విధాలా భవిష్యత్తు బాగా ఉండాలని ఉండాలని కోరుకుంటారు. కానీ రాష్ట్రంలో ప్రశ్నించే పౌరులపై వేధింపులు పెరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావును నిరుద్యోగం అంశంలో ప్రశ్నించిన నిరోషా అనే అమ్మాయిని పోలీసులు, అధికార పక్ష నేతలు వేధించారని రేవంత్ ఆరోపించారు.
ఈ విషయంలో తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇదొక్కటే కాదని, ఇలాంటివే దౌర్జన్యాలు మరెన్నో జరుగుతున్నాయని వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి బాధితురాలితో కలిసి ఎస్ఈసీకి ఫిర్యాదును అందజేసిన విజువల్స్ ఉన్నాయి.