
నిన్న సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లి లో రెండు రోజుల దీక్షలో, తాను చేసిన సవాల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని తాను సవాల్ చేశానని వెల్లడించారు. 24 గంటలు గడిచినా అధికారపక్షం నుంచి గానీ, అధికార యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ మేరకు నేడు ట్వీట్ చేశారు. తాము చేపట్టిన రెండ్రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష విజయవంతం అయిందని వెల్లడించారు.
I challenged yesterday to debate on the development of CM adopted village #Muduchintalapally ….Even after 24 hours no one from the ruling party nor officials turned up.
I thank everyone who made this two days deeksha as part of #DalitaGirijanaAtmagowravaDandora a great success. pic.twitter.com/lrsDwtOORy— Revanth Reddy (@revanth_anumula) August 25, 2021
నిన్న రేవంత్ మూడుచింతపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి, కేశవాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేశారు. దత్తత తీసుకున్న గ్రామాలకు కేసీఆర్ ఏంచేశారో చెబితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ సవాల్ చేశారు.