
మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే స్వాగతిస్తామంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గురువారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే విధంగా అసెంబ్లీలో ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందని అన్నారు.
అయితే మంత్రి పేర్ని నాని కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం,పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్రలో భాగమని ట్వీట్లో పేర్కొన్నారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.