
హుజురాబాద్ దళితబందు సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే సీఎం కేసీఆర్ చివరి రాజకీయ ప్రసంగం అని అనుకుంటున్నామన్నారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి, దళిత బంధు పథకానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, దళిత బందు కు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఎస్సీ లతో పాటుగా ఎస్టీ కుటుంబాలకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళిత బందు పథకం గూర్చి త్వరగా అసెంబ్లీ చర్చ పెట్టాలని ఆయన అన్నారు. ఈ నెల 18 న జరగబోయే దళిత, గిరిజన సభ తర్వాత, హుజురాబాద్ లో కెసిఆర్ పెట్టిన సభ ప్రాంగణం లోనే సభ పెడతామన్నారు. హైదరాబాద్ లో జరిగే సభ తర్వాత, హుజురాబాద్ పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు