
RCB New Jersy: ఐపీఎల్ లో ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
RCB అన్బాక్స్ ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయాలనుకున్న జెర్సీ ఫోటోలు ఇప్పుడు లీక్ కాగా.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది మాదిరిగానే RCB ఈసారి కూడా ఎరుపు, నలుపు కాంబో జెర్సీలో కనిపించనుంది.