
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరుద్యోగ ‘జంగ్ సైరన్’ నిరసన ర్యాలీ లో లాఠీ గాని తూటా గని ఏది తగిలిన ముందుగా తనకే తగులుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం జంగ్ సైరన్ కార్యక్రమంపై మీడియాతో మాట్లాడిన ఆయన ”గాంధీ జయంతి వేళ శాంతియుత నిరసనలు చేపట్టబోతున్నాం. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి.
ఈ పాదయాత్ర దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జంగ్ సైరన్ ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా అని రేవంత్ అన్నారు.
కార్యకర్తలు భయపడాల్సిన పని లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు” అని రేవంత్ హెచ్చరించారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి మొదలు కానున్నాయి.