
టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డును సాధించాడు. టీ-20 ల్లో 100 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు. అంతేకాదు, టీ-20 ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ-20 ల్లో ఓవరాల్ గా 100 వికెట్ల ఘనత అందుకున్న నాలుగో బౌలర్ గా రషీద్ ఖాన్ నిలిచాడు.
పాకిస్థాన్ బ్యాటర్ హాఫీజ్ వికెట్ తీయడంతో ఈ అరుదైన రికార్డు సాధించాడు. కేవలం 53 మ్యాచుల్లోనే ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మలింగ, షకీబ్ , టీమ్ సౌథీ మాత్రమే టీ-20 ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. 76 మ్యాచుల్లో 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో అఫ్గాన్ పై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది.
అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. బాబర్ అజామ్ (51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫకార్ జమాన్ (30), షోయబ్ మాలిక్ (19) ఫర్వాలేదనిపించారు. 19వ ఓవర్లో ఆసిఫ్ అలీ (25) నాలుగు సిక్స్‌లు బాది పాక్ కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, ముజీబుర్, నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.
? Holder shows his class ?
? Asif Ali, the finisher ?The talking points from a pulsating day of action at the #T20WorldCup 2021 ? https://t.co/KrbjXYiixU
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021