
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదిక పంచుకోనున్నారు. ఢిల్లీలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొననున్నారు.