
Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం “జైలర్”. వరుణ్ డాక్టర్, బీస్ట్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 50% షూటింగ్ పూర్తి చేసుకుందని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పార్ట్ లో మూడు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, వాటిలో రజినీ మాస్ యాక్షన్ చూసే ప్రేక్షకులను కనురెప్ప వెయ్యనివ్వదని, తన గత చిత్రాలు కొలమావు కోకిల, వరుణ్ డాక్టర్, బీస్ట్ కన్నా మరింత భయంకరంగా అంటే ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రంలో ఉంటాయని ఆయన చెప్పారు.