
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసునమోదు చేశారు. శ్రీరామ నవమి రోజు రాజాసింగ్ భారీ శోభాయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ శోభాయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
మసీదు ముందు శోభాయాత్ర వాహనాన్ని ఆపి, తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర మతస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్ పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.