
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. అతడు తాజాగా నటించిన తాజా మూవీ ‘అనుభవించు రాజా’. ఈ చిత్ర ట్రైలర్ను కింగ్ నాగార్జున వదిలారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కాశీష్ ఖాన్ హీరోయిన్.
అన్నపూర్ణ స్టూడియోస్ – శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి సినిమాస్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ బాగానే ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను నాగార్జున విడుదలచేయగా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.
ఓ పల్లెలో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో… హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ గార్డుగా మారతాడు. ఆమెను రోజూ చూడొచ్చు .. మాట్లాడొచ్చు అని అలా ప్లాన్ చేశాడనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో విలన్ అజయ్ అనే విషయం అర్థమవుతోంది.
“బంగారంగాడి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వత్తావుంటది.. పోతావుంటది.. ఏదీ పర్మినెంట్ గా ఆడదు ఇక్కడ” అనే రాజ్ తరుణ్ డైలాగ్, “మనం గెలవాలంటే వాడి పుంజు ఈ బరిలో ఉండకూడదు.. వాడు ఈ ఊళ్లో ఉండకూడదు” అనే అజయ్ డైలాగ్ వాళ్ల పాత్రల స్వభావాలను చెప్పేస్తున్నాయి. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ సినిమా మా నంబర్ 26 వ తేదీన విడుదల కానుంది.