
Rain Alert: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నాయ్. దీంతో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.