
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
నేను ఒకటే ప్రశ్నపెట్టాను. అదానీ షెల్ కంపెనీలో 20 వేల కోట్ల పెట్టుబడి ఎవరు పెట్టారు. ఆ నగదు ఎవరిది. మోడీ, అదానీ స్నేహ బంధం గురించి పార్లమెంట్ లో మాట్లాడాను. నిబంధనలు మార్చి ఎయిర్ పోర్టులు అదానికి ఇచ్చారు. మంత్రులు పార్లమెంట్ లో అబద్దం చెప్పారు. నేను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానన్నారు. నేను అదానీ గురించి మాట్లాడితే నన్ను టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తే నన్ను డిస్ క్వాలిఫై చేశారు. నేను స్పీకర్ కు రెండు లేఖలు రాస్తే దానికి సమాధానం లేదు. స్వయంగా స్పీకర్ ను కలిసి చర్చిస్తే నవ్వి వదిలేశారు.
అదానీ వ్యవహారం నుంచి ప్రధానిని కాపాడుకునేందుకే బీజేపీ ఈ డ్రామా చేస్తుంది. నాకు జైలు శిక్షా? నాకు అనర్హత వేసినా, జైలుకు పంపినా తగ్గేది లేదు. నేను జైలుకు వెళ్లేందుకు సిద్దం. ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం. నేను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను…పోరాడుతాను. దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతుంది. ప్రజలంతా గమనించి ముందుకు కదలాలి. బీజేపీ కుట్రను తిప్పికొట్టాలి. ప్రజాస్వామ్యం కోసం నేను ఎంత వరకైనా పోరాడుతాను. అని రాహుల్ గాంధీ తెలిపారు.