
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మొదట పిచ్ పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు మైదానంలోకి దూకారు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా పూర్తి స్థాయి పాత్రలో రోహిత్ శర్మకు న్యూజిలాండ్ సిరీస్ కీలకంగా ఉండనుంది. అందుకే గెలిచేందుకు ఎలాంటి అవకాశాలను వదులుకోకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తొలి సిరీస్‌ను విజయంతో మొదలు పెట్టాలని చూస్తున్నారు.
మరోవైపు గత టీ20 ప్రపంచకప్ తో రవిశాస్త్రి కోచింగ్ బాధ్యతలు పూర్తవ్వగా.. మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో ఇటీవలే యూఏఈ నుంచి భారత్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు తాజాగా జైపూర్ లో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో తొలిసారి ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం నూతన టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు త్రో బాల్స్ వేస్తూ కనిపించాడు. ఆ వీడియోను బీసీసీఐ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కొత్త ప్రారంభం అంటూ వ్యాఖ్యానించింది.
ఇక టీ20 ప్రపంచకప్ లో రెండు అర్ధశతకాలతో మెరిసిన రోహిత్ శర్మ నెట్స్ లో బాగా బ్యాటింగ్ చేశాడు. సరైన టైమింగ్ తో షాట్లు ఆడుతూ అందులో కనిపించాడు. కొత్త పాత్రలు, కొత్త సవాళ్లు, కొత్త ఆరంభాలు.. అంటూ తన ట్వీట్లో పేర్కొన్నది. టీమిండియా ఆఫీసులో ద్రావిడ్ రాకతో కొత్త జోష్ నిండినట్లు బీసీసీఐ తెలిపింది.