
అల్లు అర్జున్ (ALLU ARJUN), రష్మిక(RASHMIKA MANDANNA) జంటగా సుకుమార్(SUKUMAR) దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి పాటలు ఒక్కొక్కటిగా బయటకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ‘దాక్కో దాక్కో’ అనేది పాట ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. దసరా కానుకగా మరో పాట ‘శ్రీవల్లి’ ని విడుడల చేయగా ఆ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని పెంచుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు.
“నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నై పోయినట్టుందిరా .. సామీ .. నా సామీ, నిన్ను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కగుందిరా సామీ .. నా సామీ” అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్(DEVISRI PRASAD) స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్(CHANDRABOSE) సాహిత్యాన్ని అందించగా, మౌనిక యాదవ్ ఆలపించింది.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది డాన్సర్ లపై చిత్రీకరించిన ఈ పాట కలర్ఫుల్ గా ఉంది. ఖర్చు కూడా పెద్ద మొత్తంలో పెట్టినట్టుగా అనిపిస్తోంది.