
డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అంటే హై రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఈ కాంబో లో వస్తున్న మరో చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం సినిమా ప్రియులంతా ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ గెట్ యూ ఎలా ఉంటుందో చూపించి వేరే లెవెల్ లో అంచనాలు క్రియేట్ చేసారు,
ఈ సినిమా లో మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర లో కనిపించనున్నారు. ఈ మధ్యే ఆయన పుష్ప సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం ఫహద్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.