
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు. వీరికలయికలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’
ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. అందులో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. పుష్ప చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. అయితే డేట్ పై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ, ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు పోస్టర్ ద్వారా వెల్లడించారు.
This December, Theatres will go Wild with the arrival of #PushpaRaj ?#PushpaTheRise will hit the Big Screens on DEC 17th! #PushpaTheRiseOnDec17#ThaggedheLe ?@alluarjun @iamRashmika #FahadhFaasil @Dhananjayaka @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/yB2Ws1HnrA
— Mythri Movie Makers (@MythriOfficial) October 2, 2021
కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ టీజర్, ‘దాక్కో దాక్కో మేక’ పాట, రష్మిక లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్మిక పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేస్తూ, సినిమాలో రష్మిక పాత్ర పేరు శ్రీవల్లి అని చిత్ర యూనిట్ తెలియజేసింది.