
Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఫ్యాన్స్ ‘పుష్ప-2’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా, ‘పుష్ప-2’ సినిమా షూట్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో సుకుమార్ షూట్ స్టార్ట్ చేశాడట. అయితే, ఈ షూట్ లో అల్లు అర్జున్ పార్ట్ లేదని, నెలాఖరున జరిగే షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.