
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలోని నాలుగో పాట ‘ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ’ను నవంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బన్నీ, పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీవల్లిగా, రష్మిక సందడి చేయనుంది. విలన్ గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలు, గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళం, మలయాళం భాషలలో అలు అర్జున్ మాట్లాడగలుగుతాడు. అలాగే కన్నడ భాష కూడా తెలుగుకు దగ్గరగా ఉంటుంది. ఈ భాష కూడా బన్నీ బాగానే మాట్లాడగలడు. కాబట్టి తెలుగుతో పాటు ఈ మూడు భాషల్లో సొంతగా డబ్బింగ్ చెప్పడం కష్టం కాదు. అందుకే ‘పుష్ప’ అన్ని భాషలకు తానే డబ్బింగ్ చెప్తానని అల్లు అర్జున్ అన్నట్లు తెలుస్తోంది.
Can't wait to show you all the MASS swag of #PushpaRaj ?#PushpaFourthSingle Promo Soon ?
Full Song from Nov 19th ?#PushpaTheRiseOnDec17 ❤️ pic.twitter.com/1PLEvWk9Y7
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2021