
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి నాల్గో పాటను రిలీజ్ చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే గ్యాంగ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. అక్కడి గిరిజన గూడెంలను కలుపుకుంటూ ఈ కథ వెళుతుంది.
https://www.youtube.com/watch?v=pHHig1XBML0
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వదిలిన అన్ని పాటలు మంచి బీట్ లో సాగినవే. ప్రతి లిరికల్ వీడియో కూడా రికార్డు స్థాయి వ్యూస్ ను .. లైక్స్ ను కొల్లగొడుతూ వెళ్లాయి. తాజాగా నాల్గొవ సింగిల్ గా ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే మరో లిరికల్ వీడియోను వదిలారు.
“ఆ పక్కా నాదే .. ఈ పక్కా నాదే .. తలపైన ఆకాశం ముక్కా నాదే” అంటూ ఈ పాట సాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా నకాష్ అజీజ్ ఆలపించాడు. ప్రేమ్ రక్షిత్ – గణేశ్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాట, పక్కా మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను, డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.