
పవన్-హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమా కోసం నటి ప్రియమణిని తీసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై డైరక్టర్ హరీష్ శంకర్ అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రియమణి ఓ వైపు వెబ్ సిరీస్, మరో వైపు పలు భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇప్పుడు ఆమెకు అద్భుతమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో కీలకపాత్ర కోసం చిత్ర యూనిట్ ప్రియమణిని ఎంపిక చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పవన్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటన వచ్చినప్పటికీ.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత పవర్ స్టార్ ఈ సినిమాలో నటించనున్నారు. అయితే ‘నారప్ప’లో ప్రియమణి నటన చూసి ఫిదా అయిన ఈ చిత్రబృందం.. తమ సినిమా కోసం ప్రియమణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మీరు ఎన్ని హోప్స్ తో వచ్చినా దాన్ని మించి ఈ సినిమా ఉంటుందని గట్టిగా చెబుతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ క్రమంలో హరీష్ శంకర్ కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.